కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్......
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....
మంచిర్యాల...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు..
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, మంచిర్యాల జిల్లా OBC చైర్మన్ వొడ్డె రాజమౌళి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..



