Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మనస్థాపం చెంది పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 05:36 AM | 3 | Crime, TELANGANA, తెలంగాణ
మనస్థాపం చెంది పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
మనస్థాపం చెంది పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య


తెలంగాణ కెరటం, నవంబర్ 09,మంచిర్యాల జిల్లా

కుటుంబంలో తరుచూ జరుగుతున్న గొడవల వల్ల మనస్తాపం చెందిన ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూర్ పరిధిలో చోటుచేసుకుంది.
పిర్యాదురాలు అయిన పున్నపురెడ్డి రమాదేవి వైఫ్ ఆఫ్ బాపురావు, వయస్సు:35 సం లు, వృత్తి: గృహిణి, నివాసం: తాండూర్ అనునామె ఇచిన పిర్యాదు ఏమనగా ఆమె తండ్రి ఇడిదినేని నాగయ్య s/o జగ్గయ్య, వయస్సు: 55 సం లు , వృత్తి: కూలి, కులం: మున్నూరు కాపు, నివాసం: తాండూర్ మరియు అతని భార్య ఇడిదినేని పద్మల మధ్య ఆస్తి విషయమై తరుచూ గొడవలు జరుగుతుండేవి.
ఈ క్రమంలో ఈ రోజు అనగా తేదీ 09-11-2026 నాడు తెల్లవారుజామున సుమారు 01:30 గంటల ప్రాంతంలో మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో పద్మను నాగయ్య కొట్టడంతో పద్మకు గాయాలయ్యాయి. ఎప్పుడూ ఇలాగే గొడవలు జరుగుతున్నాయని తీవ్ర మనస్తాపానికి గురైన నాగయ్య ఇంట్లో ఉన్న గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, ప్రథమ చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు నాగయ్య అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.తండ్రి మరణంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, శవ పంచనామా నిర్వహించి చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుమార్తె రమాదేవి పోలీసులను పిర్యాదు చెయ్యగా పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: