తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 9):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో నాగర్ కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు జిల్లా అంధత్వ నియంత్రణ
సంస్థ మహబూబ్ నగర వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం సోమవారం విజయవంతంగా నిర్వహించారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 38మంది కంటి రోగులను పరీక్షించి 22 మందిని కంటి శుక్లాల ఆపరేషన్ కొరకు ఎంపిక చేసి వారిని ప్రత్యేక అంబులెన్స్ లో కందూరు రామ్ రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రికి కంటి శుక్లముల ఆపరేషన్ నిమిత్తమై పంపించారు. ఈ శిబిరంలో అచ్చంపేట ఏరియా ఆసుపత్రి వైద్య అధికారి డాక్టర్ ప్రదీప్ , విశ్రాంత ఆప్తాలమిక్ అధికారి సిహెచ్ గణేష్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.



