బీజేవైఎం మండల అధ్యక్షులుగా నాగరాజు యాదవ్, ప్రతాప్ నాయక్ నియామకం – దళిత మోర్చా మండల అధ్యక్షుడిగా చౌట శివ నియామకం
బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేష్ వర్మ ఆధ్వర్యంలో మండల కమిటీ అధ్యక్షుల నియామకాలు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 10):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షుడిగా నాగరాజు యాదవ్, పదరా మండల బీజేవైఎం అధ్యక్షుడిగా ప్రతాప్ నాయక్, పదరా మండల దళిత మోర్చా అధ్యక్షుడిగా చౌట శివను నియమించారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అధ్యక్షులందరికీ నియామక పత్రాలను అందజేశారు. పదరా మండల దళిత మోర్చా అధ్యక్షుడిగా చౌట శివకు బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ మాదిగ గారి ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకురాలు బల్మూరి జానకి గారు, సోషల్ మీడియా జిల్లా ఇన్‌చార్జి అఖిల్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ మాదిగ హాజరయ్యారు.బీజేపీ అమ్రాబాద్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, పదరా మండల అధ్యక్షులు నీలం రవి, అమ్రాబాద్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్ తోపాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అధ్యక్షులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.



