Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధం: ఎంపీ వంశీకృష్ణ

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 07:51 PM | 9 | Politics, తెలంగాణ
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధం: ఎంపీ వంశీకృష్ణ
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధం: ఎంపీ వంశీకృష్ణ

చెన్నూరు నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో రూ.10 కోట్ల నిధులు

సోమనపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.....

మంచిర్యాల .....
జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 320 మంది విద్యార్థులకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి విద్యాభ్యాసం, సమస్యలు, భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ..చెన్నూరు నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో రూ.10 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.సోమనపల్లి గ్రామంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఈ పాఠశాల అందుబాటులోకి వస్తే చెన్నూరు నియోజకవర్గ విద్యార్థులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: