Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేరడిగుంట ఎక్స్ రోడ్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం

Author
Posted By TELANGANA KERATAM
| 11 Nov 2026, 04:20 PM | 7 | Politics, తెలంగాణ
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేరడిగుంట ఎక్స్ రోడ్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేరడిగుంట ఎక్స్ రోడ్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 11, నవంబర్

నేరడిగుంట: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనే సంకల్పంతో నేరడిగుంట గ్రామపంచాయతీ అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు వేసింది.ఎన్నికల సమయంలో నేరడిగుంట ఎక్స్ రోడ్‌లో ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించి, మార్కెట్ అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తానని గ్రామ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలో, నేరడిగుంట ఎక్స్ రోడ్ మార్కెట్ అభివృద్ధి కోసం నేడు సొంత నిధులతో 25 కె.వి. ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది.
ఎక్స్ రోడ్ పరిసర ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడం వల్ల దుకాణదారులు, వ్యాపారులు మరియు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను గుర్తించి, మార్కెట్ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
“ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట కేవలం గెలుపు కోసం కాదు... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చడమే నా బాధ్యత” అని ఈ సందర్భంగా సర్పంచ్ వొగ్గు సాయికిరణ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొడండ ఈశ్వర్ గారు, నేరడిగుంట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.ప్రజల నమ్మకమే మా బలం... గ్రామ అభివృద్ధే మా లక్ష్యం.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: