నాగంపల్లిలో తెలంగాణ రక్షణ సేన గ్రామ కమిటీ ఏర్పాటు
తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజ ప్రతినిథి నవంబర్ 11
మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని నాగంపల్లి గ్రామంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు కుర్వ రాము, దులం నవీన్, బాల్ చేందర్, సిరిపురం నరేష్ సమక్షంలో గ్రామ కమిటీ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా సంస్థాగత కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయిలో మరింత విస్తరించి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. కవిత నాయకత్వాన్ని, నియోజకవర్గ ఇన్చార్జి రాజా ప్రభాకర్ అన్న నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను గ్రామస్థాయిలో విస్తరించాలని కుర్వ రాము పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



