Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యాభివృద్ధికి బాటలు.. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట.

Author
Posted By TELANGANA KERATAM
| 11 Nov 2026, 08:20 PM | 9 | Politics, తెలంగాణ
విద్యాభివృద్ధికి బాటలు.. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట.
విద్యాభివృద్ధికి బాటలు.. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట.

ఎంపీ డాక్టర్ మల్లు రవి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 11):

నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్ కర్నూల్ మండలం దేశిఇటిక్యాల గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనంతో పాటు, గ్రామ ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగపడే నూతన బ్రిడ్జిని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారితో కలిసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రజల రవాణా అవసరాలను తీర్చేందుకు ఎంపీ నిధులతో అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఒకే గ్రామంలో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే నూతన పాఠశాల భవనం, ప్రజల రాకపోకలకు ఎంతో దోహదపడే బ్రిడ్జి ప్రారంభం కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
విద్యకు ప్రోత్సాహం అభివృద్ధికి చిరునామా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: