Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న -దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

Author
Posted By Kancharala Shivakumar
| 11 Nov 2026, 08:57 PM | 28 | తెలంగాణ
నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న  -దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 11, తెలంగాణ కెరటం:

దుబ్బాక మండల కేంద్రంలో పెద్ద గుండవెల్లి గ్రామంలో సద్ది అనశవ్వ, అంజిరెడ్డి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన గృహాన్ని సందర్శించిన శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడుదురి నరేందర్ రెడ్డి, దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, కొండె గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు రామకృష్ణ, రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొందుగుల బాబు,స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామస్తులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: