125 స్టాళ్లతో మూడు రోజుల పాటు వ్యవసాయ ప్రదర్శన
రైతులు, పట్టణ ప్రజలు అగ్రిషోను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి
తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి (నవంబర్12);రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ పరిజ్ఞానం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా మూడు రోజుల పాటు అగ్రిషో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో నిర్వహించే అగ్రిషోను రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల వారు, పట్టణ ప్రజలు సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గురువారం నల్లగొండలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, ఎండీ హషం, పాలడుగు నాగార్జునతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరిగే అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు, 41వ జీఎం కన్వెన్షన్లలో భాగంగా అగ్రిషో ఏర్పాటు చేసినట్లు వివరించారు.వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్లు, ట్రాక్టర్లు, ఆధునిక యంత్రాలు, నూతన విత్తనాలు, ఎరువులు, డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు, వివిధ సాగునీటి పద్ధతులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రతినిధులు రైతులకు పంటల సాగు, చీడపీడల నివారణ, పంటల తెగుళ్లపై సలహాలు, సూచనలు అందిస్తారని తెలిపారు.
ప్రస్తుతం వ్యవసాయ రంగంలో నీటి కొరత ప్రధాన సమస్యగా మారిందని, అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని సమర్థంగా వినియోగించుకునే సాంకేతికతపై రైతులకు అవ�



