Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విబిజి రామ్ జి పనుల్లో వేగం పెంచాలి

Author
Posted By GADDAM UPENDAR
| 12 Nov 2026, 10:07 PM | 28 | Politics, TELANGANA, తెలంగాణ
విబిజి రామ్ జి పనుల్లో వేగం పెంచాలి

 నీటి సంరక్షణ,భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి


  నిర్ణీత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలి

 జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ఇవి కూడా చదవండి

విబిజి రామ్ జి పనుల్లో వేగం పెంచాలి

ములుగు జిల్లా బ్యూరో,(తెలంగాణ కెరటం) నవంబర్ 12:

విబిజి రామ్ జి పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి,నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ లోని మినీ సమావేశం హాల్ లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం. సంపత్ రావుతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలతో  విబిజి రామ్ జి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండలాల వారీగా ఉపాధి హామీ పనుల పురోగతి,ఇంకుడు గుంతలు,బోరుబావుల రీఛార్జ్ పాయింట్లు,ఊట చెరువులు,పంట కుంటల నిర్మాణం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు నకు దోహదపడే పనులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇంకుడు గుంతలు,బోరు బావులరీఛార్జ్ నిర్మాణాలు, ఊట చెరువులు,పంట కుంటల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని,ప్రతి ఎంపీడీఓ తమ పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.పనుల అమలులో జాప్యానికి తావులేకుండా సంబంధిత అధికారులు సమన్వయం తో పనిచేయాలని తెలిపారు.ఉపాధి హామీ పనుల అమలులో అధికారులు ఎలాంటి అలసత్వం,నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా లోని అన్ని మండలాల ఎంపీడీఓలు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: