Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కర్నూలుకు చేరుకున్న శబరిమలై అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర -అయ్యప్ప స్వాములకు వసతి కల్పించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక -స్వామియే శరణం అయ్యప్ప.. స్వామియే శరణం అయ్యప్ప.

Author
Posted By Kancharala Shivakumar
| 12 Nov 2026, 10:26 PM | 11 | తెలంగాణ
కర్నూలుకు చేరుకున్న శబరిమలై అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర -అయ్యప్ప స్వాములకు వసతి కల్పించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక -స్వామియే శరణం అయ్యప్ప.. స్వామియే శరణం అయ్యప్ప.

దుబ్బాక ప్రతినిధి,నవంబర్ 12,తెలంగాణ కెరటం:

సిద్దిపేట కోటిలింగాల అయ్యప్ప సన్నిధానం నుంచి సంఘం మధుసూదన్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమలై మహా పాదయాత్ర 13వ రోజు విజయవంతంగా కర్నూలుకు చేరుకుంది.ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు కర్నూలులో వసతి అవసరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ని కోరగా, ఆయన వెంటనే స్పందించి కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక తో మాట్లాడి, అయ్యప్ప స్వాములకు తన స్వగృహంలో వసతి ఏర్పాటు చేయించారు.అయ్యప్ప స్వాముల పట్ల ఆప్యాయతతో స్పందించి వసతి సౌకర్యం కల్పించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కి, మాజీ ఎంపీ బుట్టా రేణుకకు పాదయాత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.వారిపై అయ్యప్ప స్వామి వారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వాములందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: