Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

క్యాతనపల్లి ఫ్లైఓవర్ వద్ద వాహనాల తనిఖీల్లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Author
Posted By TELANGANA KERATAM
| 13 Nov 2026, 06:44 AM | 15 | Crime, తెలంగాణ
క్యాతనపల్లి ఫ్లైఓవర్ వద్ద వాహనాల తనిఖీల్లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
 కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...
మంచిర్యాల జిల్లా..
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని క్యాతనపల్లి ఫ్లైఓవర్ వద్ద గురువారం నిర్వహించిన వాహన తనిఖీల్లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్,స్వయంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వాహనదారుల వాహనాలను తనిఖీ చేసి,రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,డ్రైవింగ్ లైసెన్స్ తదితర వాహన సంబంధిత పత్రాలను పరిశీలించారు. వాహనదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులను సీపీ అభినందించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం,అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ,తమతో పాటు ఇతరుల భద్రతకు కూడా బాధ్యత వహించాలని సూచించారు.
ఈ తనిఖీల సందర్భంగా సీపీ వెంట శ్రీరాంపూర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్,పోలీస్ సిబ్బంది ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: