- ఉదయం సాయంత్రం భారీగా రద్దీ
- పట్టించుకోని ఆర్టీసీ యంత్రాంగం
- దూర ప్రాంతాల నుంచి రావడానికి కష్టంగా ఉంది
- ఐదు నిమిషాలకు ఒక వస్తువులే మహబూబ్‌నగర్ కి ఇప్పుడు 30 నిమిషాలకు ఒకటి
- సంగారెడ్డి బస్సు రెండు గంటలకు ఒకటి
- గ్రామాలను మర్చిపోయిన తాండూర్ ఆర్టిసి
తాండూర్, సెప్టెంబర్ 6 ( తెలంగాణ కెరటం ప్రతినిధి): వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం వ్యాపారానికి పెట్టింది పేరు. తాండూరులో వివిధ వ్యాపార కార్యకారపాల్లో జోరుగా సాగుతాయి. అనేక గ్రామాల నుంచి తాండూరు పట్టణానికి నిత్యం వేల సంఖ్యలనుకలర్ టెక్స్ట్ ప్రజలు వస్తుంటారు. తాండూరు పట్టణంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వివిధ ట్రైన్ సౌకర్యాలు బస్సు సౌకర్యాలు కందుల మార్కెట్ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ప్రైవేట్ కి సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా నిత్యం తాండూర్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది కానీ ప్రయాణికులకు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు అయితే బస్సు డోర్ల దగ్గర నిలబడి అమ్మాయిలకు అయితే మరీ ఘోరంగా ఉంది అసలు కాలేజీకి వెళ్లాలా లేదా అనేది కూడా ఆలోచిస్తున్నారు.
మహబూబ్‌నగర్ కి 30 నిమిషాలకు ఒక బస్సు
ఒకప్పుడు మహబూబ్‌నగర్ కి ఐదు నిమిషాలకు ఒక బస్సు తప్పనిసరిగా వచ్చేది కానీ ఇప్పుడు 30 నిమిషాలు అయినా ఒక బస్సు రావడం లేదు వస్తుందన్న గ్యారెంటీ లేదు. మహబూబ్‌నగర్ కి తాండూర్ నుంచి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాదాపు 50 కి పైగా గ్రామాలు ఇదే మార్గంలో ఉంటాయి. నిత్యం వేల మంది తాండూర్ మహబూబ్‌నగర్‌కు ప్రయాణం చేస్తుంటారు. ఎంత బాగానే ఉన్నా ఐదు నిమిషాలకు ఒకసారి బస్సు వస్తేనే బస్సు ఫుల్ గా వెళ్ళేది. అలాంటిది ఇప్పుడు 30 నిమిషాలకు ఒక బస్సు వెయ్యడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా సంగారెడ్డికి కూడా తాండూర్ నుంచి 30 నిమిషాలకు ఒక బస్సు వెళ్ళేది అలాంటిది ఎప్పుడు రెండు గంటలు అయినా ఒక వస్తువు కూడా లేదు ఒక వస్తువు వెళ్లిందంటే మరో బస్సు ఎప్పుడు వస్తుందో కూడా ప్రయాణికులకు తెలియడం లేదు. రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్‌కు కూడా సరైన బస్సు సౌకర్యాలు లేవు. ఇదే మార్గంలో వికారాబాద్ కూడా ఉంటుంది వెళ్లడానికి సరైన బస్సులు ఉండవు.
పట్టించుకోని ఎంక్వైరీ ఆఫీస్
తాండూరులో పేరుకు మాత్రమే ఎంక్వయిరీ ఆఫీస్ ఉంది. బస్సుల సమయపాలన ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్తాయో ప్రజలకు నిత్యం సమాచారం అందించవలసి ఉంటుంది కానీ అక్కడ ఒక్క ఆఫీసర్ కూడా ఉండదు ఒక బస్సు వచ్చిందా రాలేదా అని తెలియని ప్రజలు అలగాలంటే సామాన్యంగా ఇంక్వైరీ ఆఫీసుకు వెళ్లి అడగాలి కానీ తాండూర్ లో మాత్రం కిరాణా షాపుల అవ్వాలని లేదా బస్సు కోసం నిలబడ్డవ్వాలని అడగడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. పలు సమాచారం సరిగ్గా ఇస్తారన్న గారికి కూడా ఉండదు.
ఆర్టీసీ ఆదాయంలో తాండూరు టాప్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయ మార్గాలలో తాండూర్ పట్టణం నుంచే ఎక్కువ ఆదాయం సమకూరుతుంది సుమారుగా రోజుకు 18 నుంచి 22 కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీసీకి వస్తుంది. ఇంత భారీగా ఆదాయం వచ్చినా కానీ ఆర్టీసీలోని అధికారులు మాత్రం సరిగా పనిచేయడం. ఎక్కువగా బస్సులు నడపడం లేరు. అసలు గ్రామాలను ఎవరు పట్టించుకోవడం వేరు. పెద్ద పెద్ద గ్రామాలకు ఒక బస్సు ప్రతిరోజు అదే నడిచేది. అలాంటిది ఇప్పుడు రోజుకు రెండు పూటలు రావడమే గగనం అయిపోయింది. దయచేసి బస్సులను సకాలంలో నడిపే ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించకూడదని ప్రజలు కోరుకుంటున్నారు.



