Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్.. అండగా నేను, వివేక్ అన్న ఉంటాం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 05:51 AM | 13 | Politics, TELANGANA, తెలంగాణ
కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్.. అండగా నేను, వివేక్ అన్న ఉంటాం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

 తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.

కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తే భయపడేది లేదు.. కార్యకర్తకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది అంతకన్నా లేదు. మా కార్యకర్తల జోలికి వస్తే ముందుగా నన్ను దాటుకుని వెళ్లాల్సిందేనని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘాటుగా హెచ్చరించారు.
కాకా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లు, పోరాటాలు చూసిందని, లాఠీ దెబ్బలకు, తుపాకీ తూటాలకు సైతం వెనుకాడని చరిత్ర కాంగ్రెస్ కార్యకర్తలదని గుర్తుచేశారు. అలాంటి కార్యకర్తలను బెదిరిస్తే భయపడతారని అనుకోవడం పొరపాటన్నారు.మా కార్యకర్తకు ఏ చిన్న అన్యాయం జరిగినా మొదట అడ్డంగా నిలబడేది నేనే. కార్యకర్తల కోసం ఎంతవరకైనా పోరాడతా. అక్రమ కేసులు పెట్టినా, బెదిరింపులకు దిగినా ఒక్క కార్యకర్తను కూడా ఒంటరిగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చారు.ఇటీవల మంచిర్యాల జిల్లా తాళ్లపేటలో సర్పంచ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఎంపీ వంశీకృష్ణ, బాధిత మహిళ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి, ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా తాను, మినిష్టర్ వివేక్ ఎప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఇది కాంగ్రెస్ పార్టీ అని ఎవరి బెదిరింపులకు భయపడే పార్టీ కాదు అని . కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని ఘాటుగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: