తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...
మందమర్రి మంచిర్యాల జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం మొబైల్ వ్యాన్ ద్వారా షార్ట్ ఫిలిమ్స్‌ను ప్రదర్శిస్తూ విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో చట్టాల పట్ల అవగాహన పెంచాలని, చట్టాలను త్వరగా అవగాహన కల్పించుకోవాలనే ఉద్దేశంతో జిల్లా న్యాయ సేవా విభా అధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పొన్నారం స్కూల్, జెడ్పీఎస్‌ఎస్ బాయ్స్ స్కూల్ (మందమర్రి ), జెడ్పీఎస్‌ఎస్ గర్ల్స్ స్కూల్ (మందమర్రి ), తవక్కల్ (రామకృష్ణాపూర్), మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మొబైల్ వ్యాన్ ద్వారా న్యాయ విజ్ఞాన సదస్సులు, లఘు చిత్రాల ప్రదర్శించి విద్యార్థుల్లో చట్టాల పట్ల అవగాహన పెంచారు. మొబైల్ వ్యాన్ ద్వారా ప్రదర్శించిన లఘు చిత్రాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.డి. సంధాని, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.ఆర్. రాములు, ఎస్. సదయ్య, ఇతర డి.ఎల్.ఎస్. సిబ్బంది, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



