Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మున్సిపల్ కార్మికులను వ్యక్తిగత పనులకు వినియోగించడంపై విచారణ జరిపించాలి

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 09:40 PM | 4 | Politics, తెలంగాణ
మున్సిపల్ కార్మికులను వ్యక్తిగత పనులకు వినియోగించడంపై విచారణ జరిపించాలి
  • మున్సిపల్ కార్మికులను వ్యక్తిగత పనులకు వినియోగించడంపై విచారణ జరిపించాలి
మున్సిపల్ కార్మికులను వ్యక్తిగత పనులకు వినియోగించడంపై విచారణ జరిపించాలి 

మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రైసోద్దీన్

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 14 : మెట్‌పల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను చట్ట నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధించి, వ్యక్తిగత పనులకు, ముఖ్యంగా కొందరి సొంత ఇళ్లలో పనులకు వినియోగించుకున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు రైసోద్దీన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం రైసోద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్‌పల్లి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. పారిశుద్ధ్య కార్మికుల శ్రమను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్న కాలానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, చెల్లించాల్సిన బకాయిలను లెక్కించి, సంబంధిత మొత్తాన్ని మున్సిపల్ ఖజానాకు తిరిగి జమ చేయించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్మికుల హక్కులు, ఆత్మగౌరవం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం జరగాలని, వారి హక్కులకు భంగం కలగకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర మరియు జిల్లా సేవాదళ్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: