Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 06:20 AM | 10 | Politics, తెలంగాణ
మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ప్రగతి నగర్ డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థలం విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ జేఏసీ(JAC) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న *మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి 

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు మాట్లాడుతూ పాఠశాల స్థలం విషయంలో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పాఠశాల స్థలంలో ఎవరూ కూడా అడుగుపెట్టడానికి వీలు లేదని స్పష్టం చేసారు.
త్వరలోనే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసి పాఠశాల స్థలానికి సంబంధించి చట్టపరంగా అన్ని హక్కులు కల్పించే విధంగా కృషి చేస్తామని తెలియచేసారు.
అనంతరం పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి (DEO) గారికి పాఠశాల స్థలం రక్షించడానికి తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేశారు.
ఈ కార్యక్రమంలో JAC సభ్యులు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లితండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: