Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకం

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకం

మండల విద్యాధికారి మోహన్ రెడ్డి

బుగ్గారం, నవంబర్ 13: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంతో కీలకమైనవని మండల విద్యాధికారి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బుగ్గారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల వ్యవస్థపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు. భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు ధర్మపురి నియోజకవర్గ స్థాయి పోటీలలో పాల్గొంటారని వెల్లడించారు.
పోటీల్లో విజేతలు:
వ్యాసరచన పోటీల్లో జడ్పీహెచ్‌ఎస్ బుగ్గారం పాఠశాలకు చెందిన శ్రీ నిత్య ప్రథమ స్థానం, జడ్పీహెచ్‌ఎస్ వెలుగొండ పాఠశాలకు చెందిన నిధిత్య ద్వితీయ స్థానం సాధించారు.
క్విజ్ పోటీల్లో జడ్పీహెచ్‌ఎస్ బుగ్గారం పాఠశాలకు చెందిన రిశ్వంత్ ప్రథమ స్థానం, జడ్పీహెచ్‌ఎస్ సిరికొండ పాఠశాలకు చెందిన పావని ద్వితీయ స్థానం సాధించారు.
ఈ కార్యక్రమంలో సీఆర్పీ పురుషోత్తం, ఉపాధ్యాయులు కొమురయ్య, కృష్ణకుమారి, లచ్చయ్య, మనోహర్, శ్రీనివాస్, కిరణ్, చంద్రశేఖర్, ప్రవీణ్‌తో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: