ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13)
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బుడ్డతాండ గ్రామ యువతను క్రీడల్లో ప్రోత్సహించడంతో పాటు వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో అచ్చంపేట శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణ క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత మద్యం, మాదకద్రవ్యాలు మరియు ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తమ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతిరోజూ క్రీడా మైదానంలో ఆటలు ఆడాలని సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం, క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మూడవత్ శ్రీనివాస్ నాయక్, గ్రామ యువకులు నేనావత్ శ్రీను నాయక్, కట్రావత్ వినోద్..



