సింగరేణి, (13/11/2026: గురువారం):
మండలంలో గోదావరి జలాల తరలింపుపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూపొందించిన మ్యాప్‌ను ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.
సింగరేణి మండలం నుంచి అశ్వారాపేట మండలం, ఆంధ్రా బోర్డు మరియు పాలేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన నీటిని అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇది ఏజెన్సీ ప్రాంతం కావడంతో రైతులు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, స్థానిక కాల్వల ద్వారా తమ ప్రాంతంలోని చెరువులకు నీటిని ఇవ్వాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి సింగరేణి మండలానికి తక్షణమే సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ మండల నాయకులు కల్తీ రాంప్రసాద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



