మనోహరాబాద్ తెలంగాణ కెరటం: గ్రామస్థులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామసభ నిర్వహించడంపై గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభ నిర్వహణకు సంబంధించి గ్రామంలో ఎలాంటి చాటింపు చేయకపోవడంతో పాటు ప్రజలకు సమాచారం అందించకుండానే సమావేశం నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు.గ్రామసభ అనేది గ్రామ ప్రజలందరి భాగస్వామ్యంతో జరగాల్సిన ముఖ్యమైన సమావేశమని, ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడం వల్ల గ్రామస్థులకు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకుండా పోతుందని యువకులు పేర్కొన్నారు.గతంలో కూడా ఇదే విధంగా గ్రామస్థులకు సమాచారం లేకుండానే గ్రామసభలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కనపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విషయంపై గ్రామస్థులు, యువకులు డీఎల్‌పీఓ మరియు మనోహరాబాద్ మండల ఎంపీడీఓ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శి వ్యవహారశైలిపై విచారణ జరిపి, భవిష్యత్తులో గ్రామసభలు ప్రజలందరికీ ముందస్తు సమాచారం అందించి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామస్థులకు సమాచారం లేకుండా గ్రామసభ నిర్వహణ..
-పంచాయతీ కార్యదర్శి తీరుపై యువకుల అభ్యంతరం...
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
రామారెడ్డి మండలంలో కలకలం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి
మైనర్లతో ట్రాక్టర్ల డ్రైవింగ్.. నంబర్ ప్లేట్లు లేకుండానే అధిక వేగంగా రాకపోకలు
శెట్పల్లి గ్రామంలో రైతులకు పంటల సాగు పై అవగాహన కార్యక్రమం



