Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం.

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 02:57 PM | 15 | Politics, తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం.
కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 14):

భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు ఆధ్వర్యంలో శనివారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామ్ చందర్ రావు పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు గారు మాట్లాడుతూదేశవ్యాప్తంగా ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఎన్నికల నిర్వహణపై, ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజ్యాంగబద్ధ సంస్థలను అపహాస్యం చేస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని, నిరుద్యోగ భృతి, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు.
అదేవిధంగా 'భారత్ సమ్మిట్' పేరుతో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సమావేశం దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే శక్తులకు వేదికగా మారిందని ఆరోపించారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రానికి ప్రయోజనం లేని ఇటువంటి సమావేశాల కోసం తెలంగాణ ప్రజల కష్టార్జితమైన ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు.దేశానికి వ్యతిరేకంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్న శక్తులను హైదరాబాద్‌కు ఆహ్వానించి, ప్రజాధనంతో ఇటువంటి కార్యక్రమాలునిర్వహించడం 
కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుండా, రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో 
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, జిల్లా నాయకురాలు బల్మూరి జానకి, సోషల్ మీడియా జిల్లా ఇన్‌చార్జి అఖిల్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ మాదిగ, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేష్ వర్మ, నాగర్ కర్నూల్ టౌన్ బీజేపీ అధ్యక్షులు చెవ్వ ప్రమోద్ కుమార్, జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎలిమి రాము, ఓబీసీ మోర్చా జిల్లా ట్రెజరర్ సుధాకర్, సీనియర్ నాయకులు సూరి, సైదులు, పస్తం బాపు, కృష్ణ, భూత్ అధ్యక్షులు విజయ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: