Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చీకోడ్ గ్రామంలో హైమాక్స్ లైటింగ్ ఏర్పాటు -గ్రామ అభివృద్ధికి సహకరించిన అవదూత శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్కు కృతజ్ఞతలు తెలిపిన -సర్పంచ్ కొమిరె నరేష్

Author
Posted By Kancharala Shivakumar
| 14 Nov 2026, 04:18 PM | 17 | తెలంగాణ
చీకోడ్ గ్రామంలో హైమాక్స్ లైటింగ్ ఏర్పాటు -గ్రామ అభివృద్ధికి సహకరించిన అవదూత శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్కు కృతజ్ఞతలు తెలిపిన -సర్పంచ్ కొమిరె నరేష్

దుబ్బాక ప్రతినిధి,నవంబర్ 13, తెలంగాణ కెరటం:

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో అవదూత శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వారి సహకారంతో గ్రామంలో హైమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేశారు." ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొమిరె నరేష్ మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన అవదూత శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ అభివృద్ధికి దాతలు, ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పర్స దేవరాజు, గ్రామ పాలకవర్గ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: