Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆపదలో ఉన్న బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Author
Posted By Kancharala Shivakumar
| 14 Nov 2026, 04:36 PM | 4 | తెలంగాణ
ఆపదలో ఉన్న బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 14,తెలంగాణ కెరటం:

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవతో అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ఎల్‌ఓసీ మంజూరైంది.దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామానికి చెందిన సంగం భాను శేఖర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు ప్రసాద్ గౌడ్, బాధిత కుటుంబ పరిస్థితిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో స్పందించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి వైద్య చికిత్స నిమిత్తం రూ.2,00,000 (రెండు లక్షల రూపాయలు) విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. మంజూరైన ఎల్‌ఓసీని బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు ప్రసాద్ గౌడ్ బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి, సహకరించిన ప్రసాద్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: