Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జీతాలు పెంచే వరకు ఆందోళన ఆగదు. *మహేష్,రవి ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు.

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 09:31 PM | 6 | Politics, తెలంగాణ
జీతాలు పెంచే వరకు ఆందోళన ఆగదు.    *మహేష్,రవి ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు.
  • జీతాలు పెంచే వరకు ఆందోళన ఆగదు.
  • *మహేష్,రవి ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు.
*జీతాలు పెంచే వరకు ఆందోళన ఆగదు.
   *మహేష్,రవి ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు.*
    *మద్దూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కొనసాగిన కాంట్రాక్ట్ కార్మికుల నిరసన.*

తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 14 


    ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 పెంచే వరకు ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల ఆందోళన ఆగదని ఆసుపత్రి బ్రాంచ్ ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు మహేష్ రవి అన్నారు.తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని, కాల పరిమిత ముగిసిన ఏజెన్సీలను తక్షణమే రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో శనివారం మూడోవ రోజు మద్దూర్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట కాంట్రాక్టు పారిశుద్ధ్య,సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ కార్మికులకు నిరసన కొనసాగించారు.
     ఈ సందర్భంగా ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ నాయకులు మహేష్ రవి లు మాట్లాడుతూ:- పారిశుద్ధ్య,సెక్యూరిటీ,పేషంట్ కేర్, సూపర్వైజర్ కార్మికులకు చెల్లిస్తున్న అరకొర వేతనాలతో పూట గడవడం కష్టంగా మారిందని జరుగుతున్న ధరలతో ప్రస్తుతం ఇస్తున్న వేతనాలతో బతుకులు దినదిన గండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2012 నుండి పుష్కరకాలంగా కనీస వేతనాల జీవోలు సవరణకు నోచుకోలేదని తాజాగా గత ఆరు నెలల క్రితం ప్రభుత్వం కనీస వేతనాలు జీవోలను సవరిస్తూ కనీస వేతనాలు మూడు జోన్ లుగా నాలుగు కేటగిరీలుగా విభజించి జీవో ఆరుని విడుదల చేసిందని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆసుపత్రి కార్మికులు వేతనాల పెంపుకు నోచుకోలేదని కనీసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెంచిన కనీస వేతనాలనైనా ప్రభుత్వ ఆసుపత్రి కాంటాక్ట్ కార్మికులకు అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు.అలాగే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతినెల 1వ తేదీన కార్మికుల ఖాతాకు జీతాలు జమ చేయాలని, పండుగ జాతీయ సెలవులు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ నాయకులు మహేష్, ఇర్ఫాన్, రాజు, రవి, లక్ష్మీ,సావిత్రి, భారతమ్మ, దేవమ్మ, సకీన, రవి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: