ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 15:
మంగపేట మండలం బిక్షంపేట గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పగిడిపెళ్లి వెంకటేశ్వర్లు కుమారుడు పగిడిపెళ్లి ఓం ప్రకాష్ పోలీస్ శాఖలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటీవల సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందడం అభినందనీయమని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ యూత్ ప్రతినిధులు అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా
కొత్తగూడెంలో ఏఆర్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ, తన క్రమశిక్షణ, అంకితభావంతో ఇటీవల సివిల్ ఎస్‌ఐగా పదోన్నతి పొందిన ఓం ప్రకాష్ కు మంగపేటలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు.
త్వరలో భూపాలపల్లి ప్రాంతంలో సివిల్ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ట్రస్ట్ సభ్యులు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ మాట్లాడుతూ, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టపడి పోలీస్ శాఖలో ఉన్నత స్థాయికి ఎదగడం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, ప్రతిభను గుర్తించి గౌరవించడం జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ , ప్రధాన కార్యదర్శి బండపల్లి రవి గౌడ్, ప్రచార కార్యదర్శులు మహమ్మద్ కాజా, గగ్గురి మహేష్ , కార్యదర్శి పుణ్ణం భాస్కర్, ట్రస్ట్ గౌరవ సభ్యులు గార్లపాటి రాంబాబు , వనమాల సతీష్ , ములకల శ్రీను చల్లా రాంకీ తదితరులు పాల్గొన్నారు.



