Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఘనంగా ఎంఎస్‌ఎఫ్ వేలేరు మండల నూతన కమిటీ ఎన్నిక

Author
Posted By TELANGANA KERATAM
| 16 Nov 2026, 07:40 AM | 6 | Politics, తెలంగాణ
ఘనంగా ఎంఎస్‌ఎఫ్ వేలేరు మండల నూతన కమిటీ ఎన్నిక
మాదిగ విద్యార్థుల ఆత్మగౌరవానికి ప్రతీక మాదిగ విద్యార్థి సమాఖ్య
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా మాదిగ విద్యార్థులు ఎస్సీ వర్గీకరణ ద్వారా సాధించిన ఫలాలను సంపూర్ణంగా వినియోగించుకొని విద్య, ఉద్యోగ రంగాల్లో రాణిస్తూ విజ్ఞానం, వివేకం, వికాసంలో ముందుకు సాగాలని ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా సహ ఇన్‌చార్జి తడుగుల విజయ్ మాదిగ అన్నారు. నవంబర్ 15న వేలేరు మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం సమీపంలో మాదిగ విద్యార్థి సమాఖ్య వేలేరు మండల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్‌పీ మండల అధ్యక్షుడు రామాంచ యేసు మాదిగ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న తడుగుల విజయ్ కుమార్ మాదిగ, మండల ఇన్‌చార్జి బొడ్డు శాంతి సాగర్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుతో మాదిగలకు 9 శాతం రిజర్వేషన్లు అందుతున్నాయని తెలిపారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతాన్ని మరింత పెంచాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ అమలుతో విద్య, ఉద్యోగ రంగాల్లో మాదిగలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ సాధన కోసం పోరాడిన మందకృష్ణ మాదిగ కృషిని విద్యార్థులు మరచిపోవద్దని అన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంతో పాటు సమాజ అభివృద్ధికి బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాదిగల్లో అక్షరాస్యత శాతం పెంచేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని, భవిష్యత్ తరాలకు విద్య ప్రాధాన్యతను తెలియజేయాలని సూచించారు. మాదిగ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మాదిగ విద్యార్థి సమాఖ్య నిరంతరం పోరాడుతుందని, ప్రతి విద్యార్థి సమాఖ్యలో భాగస్వామి కావాలని కోరారు. అనంతరం ఎంఎస్‌ఎఫ్ వేలేరు మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన మండల కమిటీ అధ్యక్షుడు: ఏలా ప్రకాష్ మాదిగ, అధికార ప్రతినిధి: తాండూరి సాయి తేజ మాదిగ, ప్రధాన కార్యదర్శి: మేక రవితేజ మాదిగ, ఉపాధ్యక్షులు: అక్కల శశికాంత్ మాదిగ, మేక మధుకర్ మాదిగ, కార్యదర్శి: అక్కల రాఘవేంద్ర మాదిగ, సహాయ కార్యదర్శులు: మోతే గణేష్ మాదిగ, కొయ్యడ సాత్విక్ మాదిగ, గొర్రె లోకేష్ తేజ మాదిగ, కనకం అక్షిత్ మాదిగ, జోగు వేణు మాదిగ. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌పీ జిల్లా నాయకుడు కనకం రాజయ్య మాదిగ, ఎంఎస్‌పీ మండల అధికార ప్రతినిధి అక్కల శంకర్ మాదిగ, జోగు మల్లయ్య మాదిగ, మోతే కనకయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: