Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మానవత్వం చాటుకున్న తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకుడు

Author
Posted By TELANGANA KERATAM
| 16 Nov 2026, 07:51 AM | 5 | Crime, తెలంగాణ
మానవత్వం చాటుకున్న తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకుడు

 ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన అజర్ భాయ్

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 15 : కోరుట్ల పట్టణంలోని కిసాన్ షాపింగ్ మాల్ ఎదుట ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఇది గమనించిన తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకుడు అజర్ భాయ్ వెంటనే స్పందించి, మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడిన యువకుడికి సకాలంలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి, యువకుడిని ఆసుపత్రికి తరలించేలా సహకరించారు. సేవా దృక్పథంతో బాధితుడికి వెంటనే సహాయం అందించి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే గొప్ప మానవత్వమని చాటిన అజర్ భాయ్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: