Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆర్‌ఎస్ ప్రవీణ్ కు కవితమ్మను విమర్శించే అర్హత లేదు

Author
Posted By TELANGANA KERATAM
| 16 Nov 2026, 07:54 AM | 4 | Politics, తెలంగాణ
ఆర్‌ఎస్ ప్రవీణ్ కు కవితమ్మను విమర్శించే అర్హత లేదు

కోరుట్ల నియోజకవర్గ టిఆర్ఎస్ నేతల ఫైర్..

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 15 : టిఆర్ఎస్ చీఫ్ కవితమ్మను విమర్శించే అర్హత ఆర్‌ఎస్ ప్రవీణ్ కు లేదని, అంతకుముందు ఆర్‌ఎస్ ప్రవీణ్ తన గతాన్ని గుర్తు చేసుకోవాలని కోరుట్ల నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ..టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవితమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అవినీతి, అక్రమ ధనార్జన అవినీతిపై ప్రశ్నిస్తే, ఆమెపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అవినీతిని ప్రశ్నించే వారిపై విమర్శలు మానుకోవాలని, చేతనైతే అవినీతిని బయట పెట్టాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ ను హెచ్చరించారు. గత రాజకీయ వ్యవహారాలపై సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దళితుల అభ్యున్నతి, దళిత యువత భవిష్యత్తు అంటూ మాట్లాడే ఆర్‌ఎస్ ప్రవీణ్, ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న దళిత యువతను తన సమావేశాలు, కార్యక్రమాల కోసం తిప్పుకుంటూ వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చారని నిలదీశారు. దళిత బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటంలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. అవినీతి జరుగుతున్న కొండపోచమ్మ ప్రాజెక్టుపై వీలైతే విచారణల జరిపి, అవినీతిని బయట పెట్టాలి తప్ప, ఇలా ప్రెస్ మీట్ లు పెట్టి, విమర్శించే హక్కు ఆర్ఎస్ ప్రవీణ్ కు లేదని హితువు పలికారు. కవితమ్మను విమర్శ అర్హత ఆర్ఎస్ ప్రవీణ్ కు లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు లింగంపల్లి సంజీవ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సుఖేందర్ గౌడ్, అధ్యక్షుడు అడ్లగట్ట సంతోష్ కుమార్, అధికార ప్రతినిధి చెట్లపల్లి మీనా, మెట్పల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు ప్రీతి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొలిచెల్మెల లత, కోరుట్ల మండల మహిళా అధ్యక్షురాలు విజయ, వైస్ ప్రెసిడెంట్ ఎండి ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: