మొట్టమొదటి ఆదివాసి స్వతంత్ర సమరయోధుడు
బిజెపి జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 15 : బ్రిటిష్ పరిపాలన కాలంలో గిరిజన హక్కులకై పోరాడి అతిపిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి గిరిజన స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా అని బిజెపి బిజెపి జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిర్సా ముండా 151,వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ ఒక గిరిజన నిరుపేద కుటుంబంలో 15 నవంబర్ 1975లో జన్మించిన బిర్సా ముండా తన చిన్నతనంలో గొర్రెలు కాసేవాడని తర్వాత ఒక మిషనరీ స్కూల్లో చదువుతున్న సమయంలో ఆ రోజుల్లోనే బ్రిటిష్ పాలనలోని జమీందారు వ్యవస్థ, వెట్టిచాకిరి నచ్చక బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి గిరిజన భూములు లాక్కున్న జమీందారు వ్యవస్థపై పోరాటం మొదలుపెట్టి గిరిజన తండాలలో విప్లవాన్ని రగిలించిన అగ్నికణం బిర్సాముండా అని కొనియాడారు. బిర్సా ముండా తన 24,వ ఏట మహా విప్లవానికి నాయకత్వం వహించి అటవీ భూములపై గిరిజనులకే హక్కులు అంటూ పోరాడి గిరిజన పాలిట దేవుడు అయ్యారని అన్నారు. తన 24 ఏళ్ల వయసులో గిరిజన జాతికి తండ్రిగా భావించి, బిర్సముండాను భగవాన్ అని పిలుచుకోబడిన త్యాగమూర్తి అని అన్నారు. గిరిజన హక్కులకై చేస్తున్న పోరాటం బ్రిటిష్ పాలకులకు కంటినిండా నిద్ర లేకుండా చేసినందుకు బ్రిటిష్ వారు బిర్సాముండాను అరెస్టు చేసి, రాంచి జైల్లో బంధించి విషం ఇచ్చి చంపి, చివరకు అనుమానాస్పద మృతిగా సృష్టించి, కలరా వ్యాధి సోకడం వల్ల మరణించారని చిత్రీకరించారని అన్నారు. బిర్సా ముండా ఆశయాలను స్పూర్తిగా తీసుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ పని చేస్తూ భారతదేశంలోని 19,500 గ్రామాలకు కనీస సౌకర్యాలు అయిన తాగునీరు, రోడ్లు, విద్యుత్తు సౌకర్యం కల్పించి గిరిజనుల పాలిట దేవుడు అయ్యారని అన్నారు. 65 ఏళ్లు భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ గిరిజన తండాలకు మారుమూల ప్రాంతాలకు కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితిలో ఉందని అన్నారు. సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం ఎరుగని తండాలకు సైతం నరేంద్ర మోడీ నాయకత్వంలో సెల్ ఫోన్ ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో గిరిజన తండాలను భాగస్వాములను చేస్తున్నారంటే దానికి కారణం బిర్సా ముండా అని కొనియాడారు.రాజ్యాంగ ఫలాలు దేశంలోని చిట్టచివరి వ్యక్తికి అందినప్పుడే అంత్యోదయ లక్ష్యం నెరవేరుతుందని అందుకే అస్సాంలోని తేయాకు తోటల్లో కూలి పని చేసుకునే ద్రౌపది ముర్మును దేశ రాష్ట్రపతిని చేసి ఆదివాసీలకు అరుదైన గౌరవం నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్, పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, జిల్లా కార్యదర్శులు ఏనుగు ముత్యం రెడ్డి, పాత రమేష్, గుంటుక సదాశివ్ కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్, మత్స్య సెల్ జిల్లా కన్వీనర్ బద్దెల గంగరాజం, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు తదితరులు పాల్గొన్నారు.



