Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కావాలనే టార్గేట్ చేస్తున్నారు

Author
Posted By D RAMAKRISHNA
| 16 Nov 2026, 11:01 PM | 27 | TELANGANA, ఖమ్మం, తెలంగాణ
కావాలనే టార్గేట్ చేస్తున్నారు

కావాలనే టార్గేట్ చేస్తున్నారు

  • పువ్వాడ ఉదయ్ నగర్ కార్యదర్శిపై కలక్టరెట్ లో  ఫిర్యాదు 
ఖమ్మం, నవంబర్ 16 (తెలంగాణ కెరటం): పువ్వాడ ఉదయ నగర్ కార్యదర్శి మహేష్ పై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు ఆరోపణలు చేస్తూ, ముగ్గురు బాధితులు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసు రెడ్డి కు ఇచ్చిన ఫిర్యాదులో... తాను ఒంటరి మహిళల ను తనకు 2017 లో ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేయగా ఆ స్థలంలో నే ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు అనుమతి, అదేవిధంగా ఇంటి నెంబర్ కూడా తన ప్లాటుకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా తనకు ఏమాత్రం సంబంధం లేని 193 నెంబరు గల ప్లాటును తాను ఆక్రమించి నట్లుగా పువ్వాడ ఉదయ నగర్ గ్రామ కార్యదర్శి మహేష్ తప్పుడు నివేదికను సమర్పించాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటువంటి తప్పుడు నివేదికను పలు వాట్సాప్ గ్రూప్ లలో  ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి మహేష్ ఫార్వర్డ్ చేయటం, మహిళగా తనను చిన్నచూపు చూడటంతో పాటు  తనకు ఏమి చేయగలుగుతారు అనే అహంభావంతో  ప్రవర్తించినట్లు తన ఫిర్యాదులో ఆమె ఆరోపించారు. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో, మండల తాసిల్దార్ , ఎంపీడీవో  లకు ఫిర్యాదు చేసామన్నారు.  సదరు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని మండలాధికారులకు ఫిర్యాదు చేయగా వారు కార్యదర్శి మహేష్ నుండి వివరణ తీసుకొని, మండల అధికారులు ఆ వివరణ పట్ల సంతృప్తి చెంది, మిన్న కుండిపోయారని ఆమె తన ఫిర్యాదులో విమర్శించారు.  తనపై కక్షపూరితకంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా నా పరువు ప్రతిష్ట లకు భంగం కలిగించిన పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామపంచాయతీ  కార్యదర్శి మహేష్ పై శాఖపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో  విజ్ఞప్తి చేశారు.  పువ్వాడ ఉదయ్ నగర్ పంచాయతీ కార్యదర్శి మహేష్ నివేదికను అనుసరించి, రఘునాధపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అశోక్ కుమార్, ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తును రద్దు చేస్తున్నట్లు నోటీస్ పంపడం  సమంజసంగా లేదని భూక్య నాగేంద్ర తన ఫిర్యాదులో పేర్కొంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. తనకు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు కాగా తన ఇల్లు  కూల్చివేత ఉదంతం, కొంత ఆర్థిక సమస్యలు వల్ల నాడు ఇల్లు కట్టుకోలేక రెండవ విడతలో కట్టుకుందామని దరఖాస్తు సమర్పిస్తే దానిని రద్దు చేశారని తన ఫిర్యాదులో ఆమె వివరించారు. తనపై కక్షగట్టి కార్యదర్శి తాను ఇక్కడ నివసించడం లేదని, నాకు ఎక్కడో ఇల్లు ఉందని  చెప్పడం ద్వారా తనకు ఇక్కడ ఇల్లు లభించకుండా చేస్తున్నారని విమర్శించారు. తాను మొదటి నుండి ఇక్కడే ఉంటున్నానని సర్వే సందర్భం కూడా తాను ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో  తెలిపారు. ఎంపీడీవో ఇచ్చిన నోటీసు రద్దు చేస్తూ తనకు రెండో విడతలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు రద్దు చేయకుండా అనుమతించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరో బాధితు రాలు  కందునూరి రేణుక భర్త యాకేష్ కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ తాను ఇక్కడ  ఇల్లు కట్టుకొని నివసిస్తున్నప్పటికీ  మరో మహిళ  ఎడ్లపల్లి రేణుక  పేరుతో ఇంటి నెంబర్ కేటాయించారని, ఇందుకు గ్రామపంచాయతీ మహేష్ ప్రధాన కారకుడని ఆరోపించారు. తాను తన ప్లాటు నెంబరు పైన విద్యుత్ సౌకర్యంతో పాటు  గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను కూడా కడుతున్నానని వివరిస్తూ ఇదే పువ్వాడ  ఉదయ్ నగర్  లో ఆమెకు వేరే ప్లాటు ఉండగా తన ప్లాటు కు సంబంధించి ఇంటి నెంబర్ కేటాయించడం మాత్రమే కాకుండా ప్రస్తుతం నేను నివసిస్తున్న ఇంటి విద్యుత్ సౌకర్యాన్ని తొలగించాలని పంచాయతీ కార్యదర్శి మహేష్  కక్ష పూరితంగా  వ్యవహరిస్తున్నాడని  తన ఫిర్యాదులో  ఆరోపించారు. కాగా వీటిపై పువ్వాడ ఉదయ నగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ కు వివరణ అడగగా  ఇవ్వని నిరాహార ఆరోపణలు అని కొట్టిపడేశారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు  బానోతు  భద్రు నాయక్ నాయక్  తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: