Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నెరవేరనున్న ప్రజల చిరకాల ఆకాంక్ష

Author
Posted By D RAMAKRISHNA
| 17 Nov 2026, 08:37 PM | 2 | TELANGANA, ఖమ్మం, తెలంగాణ
నెరవేరనున్న ప్రజల చిరకాల ఆకాంక్ష

నెరవేరనున్న ప్రజల చిరకాల ఆకాంక్ష

  • ఖమ్మం రైల్వే స్టేషన్ పార్కింగ్ కోసం 4,400 స్క్వేర్ యార్డ్ ప్రభుత్వ భూమి కేటాయింపు
  • ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి

ఖమ్మం, నవంబర్ 17 (తెలంగాణ కెరటం): ప్రజల చిరకాల ఆకాంక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే స్టేషన్ ప్రక్కన భద్రాచలం వెళ్ళే రోడ్డు విస్తరణకు మార్గం సుగమం చేశామని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలోని భూమి అప్పగింత కార్యక్రమంలో పాల్గొని కలెక్టరేట్ లో మీడియా ప్రతినిధులతో ఈ అంశంపై ఎంపీ వివరించారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని రైల్వే స్టేషన్‌ ప్రక్కన భద్రాచలానికి వెళ్లే రహదారి కేవలం 15 నుంచి 16 అడుగుల వెడల్పు మాత్ర మే ఉందని, గత 20 ఏళ్లుగా ఆ రహదారిని విస్తరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ఆ రహదారి విస్తరణకు, ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన భూముల బదలాయింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు రైల్వే శాఖతో చర్చలు జరిపి భూమి సమస్య పరిష్కారానికి కృషి చేశామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రక్కన భద్రాచలం వెళ్ళే రహదారి విస్తరణకు అవసరమైన భూమి ని రైల్వే శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించేలా ప్రతిపాదనలు రూపొందించామని ఎంపీ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు సర్వే నిర్వహించి 5,500 స్క్వేర్ యార్డ్ రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించారని వివరించారు. దీనికి బదులుగా ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు 4,400 స్క్వేర్ యార్డ్ రాష్ట్ర ప్రభుత్వ భూమిని రైల్వే శాఖకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో విడుదల చేసిందని తెలిపారు. ఈ భూముల బదలాయింపు ప్రక్రియలో ముఖ్యమంత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రితో చర్చించి, రైల్వే శాఖను ఒప్పించడంలో కీలక చొరవ తీసుకున్నారని ఎంపీ తెలిపారు. ఫలితంగా భద్రాద్రి కొత్తగూడెంలో 5,500 స్క్వేర్ యార్డ్ రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తయిందని పేర్కొన్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెంలో భూమి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించబడిందని, పంచనామా ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ ప్రజలకు ఉపయోగపడే మౌళిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమమైందని అన్నారు. ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే శాఖకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ భూమి విషయంలో అక్కడ ఉన్న షాపులకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, భూమి బదలాయింపు ప్రక్రియలో ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కు ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద రహదారి విస్తరణ కోసం రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు సహకరించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌కు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత రైల్వే అధికారులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: