Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సీఎం సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ.. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన -దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

Author
Posted By Kancharala Shivakumar
| 17 Nov 2026, 04:55 AM | 4 | తెలంగాణ
సీఎం సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ.. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన -దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 16,(తెలంగాణ కెరటం)

ఈ నెల 19న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు సంబంధించి సిద్దిపేటలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఐజీ కార్తికేయ, సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రేష్మి పెరుమాళ్ సిద్దిపేట సమీపంలోని సభా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణం అనుకూలత, వేదిక ఏర్పాటు, పార్కింగ్ సౌకర్యాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు.ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీస్ అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.ఈ కార్యక్రమంలో తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి పద్మారెడ్డి, మిరుదొడ్డి మండల అధ్యక్షుడు నర్రా రాజిరెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: