తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 18):
సమాజంలో విద్యావ్యవస్థలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించకుండా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది సాధ్యమయ్యే అంశం కాదని నాగర్ కర్నూల్ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఇడియట్ ఇంటర్ విద్యను స్కూల్ విద్యలో విలీనం చేసే అంశంపై నేడు రూబీ గార్డెన్లో సిపిఐ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బాల నరసింహ, సిపిఎం జిల్లా కార్యదర్శి వి. పర్వతాలు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ శర్మ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రైవేటు జూనియర్ కాలేజీల అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి ఎర్ర మద్దిలేటి, ఎస్టియు జిల్లా నాయకులు కరుణాకర్ రెడ్డి, యుటిఎఫ్ జిల్లా రాష్ట్ర మాజీ నాయకులు అబ్దుల్లా ఖాన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బలముల ప్రేమ్ కుమార్, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మీపతి, ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి తుమ్మల శివుడు, ఏఐఎస్ఎ రాష్ట్ర కోకన్వీనర్ షేక్ అల్తాఫ్, బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ శివశంకర్ యాదవ్, ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి డిహెచ్పిఎస్, జిల్లా అధ్యక్షులు టి కిరణ్ కుమా,ర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వి రవీందర్, తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీసుకువచ్చిన ఈ నూతన విద్యా పాలసీని స్వాగతిస్తున్నామని కానీ అంతకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విధులు ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని సూచించారు దశాబ్దాలుగా పాఠశాలలు పేరుకుపోయిన ఈ సమస్యలన్నీటిని పరిష్కరించకుండా ఆగమేఘాల మీద ఈ నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం అనేది స్వాగతించదగ్గ విషయం కాదని భక్తుల అభిప్రాయపడ్డారు ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఈ రకమైన విధానాలతో ఇంటర్ బోర్డును రద్దుచేసి సీనియర్ సెకండరీ విద్యతో ముందుకెళ్తే విద్యను వ్యాపారంగా మార్చుకొని సమాజాన్ని ప్రభుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న కార్పొరేట్ శక్తులకు మరింత ఊతమిచ్చేలా అవుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కేవలం 11వ తరగతి విద్య మాత్రమే కార్పొరేట్ చేతుల్లో చిక్కిందని, ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే 9,10, 11, 12 తరగతి కార్పొరేట్ కళాశాలల కబంధహస్తాల్లో బందీ అయ్యే ప్రమాదం ఉందని వివిధ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి నిర్ణయం మంచిదే అయినప్పటికీ సమాజంలో ఉన్న విద్యార్థి ఉపాధ్యాయ మేధావులతో చర్చించి మరింత ప్రజల్లోకి అంశాన్ని తీసుకెళ్లిన తర్వాత విద్యావ్యవస్థలో ఉన్న అనేక లోపాలను సరిచేసి సమస్యలను పరిష్కరించిన తర్వాత ఈ నిర్ణయం అమలు చేస్తే ఆరోగ్యవంతంగా మన రాష్ట్ర విద్యా విధానం ముందుకు వెళ్లే అవకాశం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సందీప్. సంతోష్. జగన్. ఏఐవైఎఫ్ నాయకులు శివకృష్ణ. జంగం శివుడు. మైనారిటీ హక్కుల సాధన సమితి అధ్యక్షులు ఎండి.నిజాం తదితరులు పాల్గొన్నారు.



