Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాతో ఆర్థిక భరోసా

Author
Posted By TELANGANA KERATAM
| 20 Nov 2026, 09:41 PM | 10 | Politics, తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాతో ఆర్థిక భరోసా
ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాతో ఆర్థిక భరోసా

చైర్పర్సన్ వసంత గంగాధర్, జువ్వాడి కృష్ణారావు 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 20 : ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాతో ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జువ్వాడి కృష్ణారావులు అన్నారు. కోరుట్ల పట్టణంలోని 13,వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా దరఖాస్తుల స్వీకరణ నిర్వహించగా, ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ లతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, ఆపద సమయంలో అండగా నిలవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేస్తుందన్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 05 లక్షల రూపాయల జీవిత బీమా అందించడమే ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కోటి ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. భూమి, ఆస్తులు లేని కుటుంబాలకు సైతం జీవిత బీమా భరోసా కల్పించాలనే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డు లేని అర్హులైన కుటుంబాలను సైతం గుర్తించి పథకంలో భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డివో రఘువరన్, మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర, పలువురు కౌన్సిలర్ లు, అధికారులు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: