Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భువనగిరిలో ఘనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథక ప్రారంభోత్సవం

Author
Posted By TELANGANA KERATAM
| 20 Nov 2026, 09:46 PM | 12 | Politics, తెలంగాణ
భువనగిరిలో ఘనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథక ప్రారంభోత్సవం
భువనగిరిలో ఘనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథక ప్రారంభోత్సవం

భువనగిరి: భువనగిరి పట్టణంలోని 18, 35, 6, 7 వార్డులకు సంబంధించి నెహ్రూ కెన్నెడీ పార్కులో ఇందిరమ్మ జీవిత బీమా పథక ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు హాజరై పథకాన్ని ప్రారంభించారు. వారితో పాటు భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్  పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...
పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఈ బీమా పథకం ఆదుకుంటుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవాలని, ఎవరూ మిస్ కాకూడదని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ గారు మాట్లాడుతూ.భువనగిరి పట్టణంలోని ప్రతి వార్డులో అర్హులందరికీ ఈ బీమా పథకం అందేలా చూస్తామని అన్నారు. వార్డుల వారీగా సర్వే చేసి, ఎవరూ మిగిలిపోకుండా నమోదు చేయిస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పారు. మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడు తు ఇందిరమ్మ జీవితభి మా పథకం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమీషనర్ చంద్ర ప్రకాష్ రెడ్డి,పీసీసీ డెలిగేట్ తంగాళ్ళ పల్లి రవి కుమార్, పాలకుర్తి అబ్జర్వర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్ పోతాం శెట్టి మంజుల 18, 35, 6, 7 వార్డుల కౌన్సిలర్లు, పాశం అమర్, కుక్క దుగు పద్మావతి, తాహరా బబ్లు కోఆప్షన్ మెంబర్లు మాజీ చైర్మన్ లు, మాజీ కౌన్సిలర్ లు  పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ward ఆఫీసర్లు సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: