Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పదర మండలంలో బీజేవైఎం నేతల రక్తదానం.

Author
Posted By TELANGANA KERATAM
| 20 Nov 2026, 11:30 PM | 6 | Politics, తెలంగాణ
పదర మండలంలో బీజేవైఎం నేతల రక్తదానం.
పదర మండలంలో బీజేవైఎం నేతల రక్తదానం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 20):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదరా మండల కేంద్రంలో బీజేవైఎం (భారతీయ జనతా యువమోర్చా) మండల అధ్యక్షులు ప్రతాప్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీ దన్నోజు నరేష్ చారి హాజరయ్యారు.
ఈ సందర్భంగా దన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ
“రక్తదానం అనేది ప్రాణదానం. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారికి రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు లభిస్తుంది. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన కలిగి ఉండి, స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని . యువత సమాజ సేవలో భాగస్వాములై ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలి. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం మనందరి సామాజిక బాధ్యత” అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సోషల్ మీడియా జిల్లా ఇన్‌చార్జి అఖిల్ రెడ్డి, పదర మండల అధ్యక్షులు నీలం రవి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు డా" రవీందర్ చౌహన్, బీజేపీ నాయకులు హనుమంత్ నాయక్, హనుమంత్ రెడ్డి, బీజేవైఎం కార్యకర్తలు  పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: