Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బాదినేని రాజేందర్

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 06:41 AM | 5 | Politics, తెలంగాణ
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బాదినేని రాజేందర్
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బాదినేని రాజేందర్

జగిత్యాల జిల్లా: దొంతాపూర్ గ్రామంలో మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ధర్మపురి మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, బుగ్గారం మండల తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ బాదినేని రాజేందర్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని సంబంధిత నిర్వాహకులకు సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుద్దాల స్వరూప-లక్ష్మణ్, ఉపసర్పంచ్ రాచకొండ సత్తయ్య, ఎడపల్లి సర్పంచ్ పత్తి ప్రభాకర్, మాజీ మార్కెట్ డైరెక్టర్లు ర్యగాళ్ల నారాయణ, సిగిరి భూమారెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్ర మోహన్, మ్యాక్స్ ఇన్‌చార్జ్ మొగిలి సాయికుమార్, మాజీ ఎంపీటీసీ జైనకుంట రజిత-సుధాకర్, కుమ్మరి లక్ష్మణ్, జాజాల రమేష్, ఉయ్యాల రాజు గౌడ్, బండ్ర సుమన్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: