Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అంబులెన్సులోనే ప్రసవం.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి కొండాపూర్ వద్ద అంబులెన్సును నిలిపి సురక్షిత ప్రసవం చేసిన సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 22 Nov 2026, 11:32 AM | 15 | నిర్మల్, తెలంగాణ
అంబులెన్సులోనే ప్రసవం.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి కొండాపూర్ వద్ద అంబులెన్సును నిలిపి సురక్షిత ప్రసవం చేసిన సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం
 అంబులెన్సులోనే ప్రసవం.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి
కొండాపూర్ వద్ద అంబులెన్సును నిలిపి సురక్షిత ప్రసవం చేసిన సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం

 అత్యవసర సమయంలో అంబులెన్సు సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేయించారు. మార్గమధ్యంలోనే అంబులెన్సులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన మామడ మండలంలో చోటుచేసుకుంది.

నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన అమీనా బేగం (30), భర్త సహీద్‌కు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్సుకు సమాచారం అందించారు. వెంటనే గ్రామానికి చేరుకున్న అంబులెన్సు సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోని కొండాపూర్ వద్ద నొప్పులు తీవ్రం కావడంతో వాహనాన్ని నిలిపివేశారు.
అంబులెన్సులో విధులు నిర్వహిస్తున్న అత్యవసర వైద్య సహాయకుడు సురేష్, వాహన సిబ్బంది జ్ఞానేశ్వర్ సహకారంతో సురక్షితంగా ప్రసవం చేయించారు. దీంతో అమీనా బేగం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అనంతరం తల్లీబిడ్డను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డ ప్రాణాలను కాపాడిన అంబులెన్సు సిబ్బందిపై పలువురు ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: