Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మీ గ్రామానికి వచ్చే నిధులు.. ఖర్చుల వివరాలు ఇక మీ అరచేతిలోనే!

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 22 Nov 2026, 12:30 PM | 24 | నిర్మల్, తెలంగాణ
మీ గ్రామానికి వచ్చే నిధులు.. ఖర్చుల వివరాలు ఇక మీ అరచేతిలోనే!
మేరీ పంచాయతీ యాప్‌తో గ్రామ పంచాయతీ ఆదాయ, వ్యయ వివరాలు తెలుసుకునే అవకాశం.. ప్రతి పౌరుడు యాప్‌ను వినియోగించుకోవాలి**

గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, వివిధ పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు, గ్రామ అభివృద్ధి పనులకు చేస్తున్న ఖర్చుల వివరాలను ప్రజలు ఇక సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ‘మేరీ పంచాయతీ’ యాప్ ద్వారా తమ గ్రామానికి సంబంధించిన నిధుల కేటాయింపులు, ఖర్చులు, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను మొబైల్ ఫోన్‌లోనే పరిశీలించవచ్చు.

గ్రామ పంచాయతీల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ నిధుల వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. గ్రామానికి ఎంత నిధులు వచ్చాయి? ఏయే పనులకు ఎంత ఖర్చు చేశారు? అభివృద్ధి పనుల వివరాలు ఏమిటి? వంటి అంశాలను పౌరులు స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది.

కాబట్టి ప్రతి గ్రామ పౌరుడు తమ స్మార్ట్‌ఫోన్‌లో మేరీ పంచాయతీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తమ గ్రామానికి సంబంధించిన నిధులు, ఖర్చుల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే ప్రభుత్వ నిధుల వినియోగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి.

**గ్రామ నిధుల వివరాలు తెలుసుకోవడం ప్రతి పౌరుడి హక్కు.. పారదర్శక పాలనకు ప్రజల భాగస్వామ్యమే బలం!**

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: