ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో వ్యాధి నుంచి రక్షణ కల్పించేందుకు రెండు చుక్కల పోలియో మందులు వేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) గారు పాల్గొని, తల్లిదండ్రులు తమ ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో మందులు వేయించాలని కోరారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శంకర్ గారు, హెడ్ నర్స్ సుజాత గారు, ఆశా మరియు ఏఎన్ఎం వర్కర్లు, శాంతా సిస్టర్ గారు, అంగన్‌వాడీ టీచర్ గారు, ఆత్మ కమిటీ డైరెక్టర్ కాలేదు గారు, నాయకులు వీరేశం, అశోక్, చెన్నయ్య, విజయ్, భరత్, వినయ్, చంటి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.రెండు చుక్కలే రక్షణ కవచం… ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం!ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) వైస్ చైర్మన్, ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ.
వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) ఆధ్వర్యంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం –
వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) ఆధ్వర్యంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం – తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 22, నవంబర్,చిన్నారులకు రెండు చుక్కల పోలియో మందుల పంపిణీ!ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15, 16, 17వ వార్డులలో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:



