తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 22 : కోరుట్ల పట్టణంలోని 21,వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకంలో భాగంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు ఆదివారం మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, 21,వ వార్డు కౌన్సిలర్ షాహనాజ్ సుల్తానా రిజ్వాన్, జగిత్యాల డిస్టిక్ మైనార్టీ అధ్యక్షులు యంఏ నయీంలు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాలకు ప్రతినెలా పెన్షన్ అందించడం ద్వారా వారి జీవనానికి ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
21,వ వార్డులో నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:



