Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కేసీఆర్ ఆమరణ దీక్ష చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత ఘట్టం

Author
Posted By TELANGANA KERATAM
| 24 Nov 2026, 07:06 AM | 4 | Politics, తెలంగాణ
కేసీఆర్ ఆమరణ దీక్ష చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత ఘట్టం
దీక్షా దివస్‌ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి 
జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 23 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో ఒక చారిత్రాత్మక మలుపు అని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సోమవారం ఇంటింటికీ వెళ్లి మహిళలకు, ప్రజలకు బొట్టు పెట్టి కేసీఆర్ చేపట్టిన దీక్ష ప్రాముఖ్యతను, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ చరిత్రను వివరిస్తూ ప్రజలను నవంబర్ 29,న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జగిత్యాల పట్టణ ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఎవరో పెట్టిన భిక్ష కాదని, వేలాది మంది ఉద్యమకారుల పోరాటాలు, విద్యార్థుల త్యాగాలు, అమరుల బలిదానాలు, కేసీఆర్ అలుపెరుగని నాయకత్వ పోరాట ఫలితమని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలించిందని, దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంపై దృష్టి పడేలా చేసిందని అన్నారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందని, తెలంగాణ రాష్ట్ర సాధనకు బలమైన పునాది వేసిందన్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎందరో విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు భాగస్వాములయ్యారని, అమరుల త్యాగాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. దీక్షా దివస్ అనేది కేవలం ఒక కార్యక్రమం లేదా వేడుక మాత్రమే కాదని, మన తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఉద్యమ చరిత్రను భావితరాలకు అందించే బాధ్యత అని పేర్కొన్నారు. బొట్టు అనేది కేవలం తిలకం కాదు..తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు..అందుకే ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి దీక్షా దివస్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని ప్రతి కుటుంబానికి గుర్తు చేస్తున్నామని తెలిపారు. నాడు తెలంగాణ కోసం పోరాడిన నాయకత్వం, నేడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాపాడుకునే బాధ్యత కూడా మనందరిపై ఉందన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటూ, తెలంగాణ ఉద్యమ ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నంతకాలం నవంబర్ 29 గుర్తుంటుందని, కేసీఆర్ దీక్షా స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఇంటి గడపకు దీక్షా దివస్ సందేశాన్ని తీసుకెళ్లి, ప్రతి ఒక్కరిలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ చైతన్యపరచడమే తమ లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ విజయ లక్ష్మి దేవందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావ్, ఉప అధ్యక్షుడు వొళ్ళేం మల్లేశం, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్, 40,వ వార్డు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గంగిపెల్లి సరిత వేణుమాధవ్, పార్టీ నాయకులు గాజుల రాజేందర్, అనురాధ, బొల్లరపు కళ్యాణి నవీన్, అరుముల్లా మానస, శివ రూప, నిఖిల్ రెడ్డి, ఎలమద్రి కిషోర్, గంగిపెల్లి శేఖర్, గాజుల శ్రీనివాస్, బొంగోని పవన్, గట్ల శ్రీనివాస్, ఆది శేషు, చేని తిరుపతి, పెండెం గంగాధర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: