Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సత్యసాయి బాబా ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు

Author
Posted By TELANGANA KERATAM
| 24 Nov 2026, 07:08 AM | 3 | Politics, తెలంగాణ
సత్యసాయి బాబా ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు
జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ 
దుప్పట్లు, సైకిళ్లు, కుట్టుమిషన్లు, పేదలకు బియ్యం పంపిణీ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 23 : జగిత్యాల పట్టణంలోని శివవీధిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101,వ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యసాయి బాబా ఆశయాలకు అనుగుణంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, అవసరమైన వారికి సైకిళ్లు, మహిళలకు కుట్టుమిషన్లు, నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాలను అడువాల జ్యోతి లక్ష్మణ్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ.. సేవే మానవత్వానికి ప్రతిరూపమని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, మానవత్వం అనే సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: