కట్లకుంటలో రోడ్లకు ఇరువైపులా చెట్లకొమ్మల తొలగింపు
ఆదర్శంగా నిలిచిన గ్రామ మిత్రబృందం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : మేడిపెల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో మేడిపల్లి రహదారికి కిలోమీటర్ మేరకు రోడ్డు పక్కన చెట్లు పెరిగి రోడ్డు వరకు కొమ్మలు రావడంతో, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడడంతో గమనించిన కట్లకుంట గ్రామస్తులు, 07,వ వార్డు సభ్యుడు గోపిరాజు, 10,వ వార్డ్ సభ్యుడు అశోక్ రాజు వారి మిత్రులు తిరుపతి (పొలిటికల్) సంజీవ్ రహీంతో కలిసి స్వచ్ఛందంగా రోడ్డు పక్కన పెరిగి ఇబ్బందికరంగా మారిన చెట్టు కొమ్మలను తొలగించి, ప్రయాణికుల ఇబ్బందులను తీర్చారు. కట్ చేసిన కొమ్మలను తొలగించి, రోడ్డుకు దూరంగా వేశారు. రోడ్డు పక్కన చెట్లు పెరిగి వాటి కొమ్మలు రోడ్డు వరకు వస్తూ, ప్రయాణికులకు, వాహనాలకు ఇబ్బందికరంగా మారాయని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, వాటిని తొలగించి ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు చేయకుండా చేశామని కట్లకుంట మిత్రబృందం సభ్యులు పేర్కొన్నారు. గోపి రాజు మాట్లాడుతూ.. రోడ్డు కిరువైపులా పెరిగిన చెట్లతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని, ప్రాణం విలువైనదని, ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా ఉంటే గ్రామ అభివృద్ధి సాధ్యమని, గ్రామానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో సహకరించిన మిత్ర బృందానికి గోపి కృతజ్ఞతలు తెలిపారు. మిత్ర బృందాన్ని గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అభినందించారు.



