Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వేయింగ్ స్కేల్ తూకంలో మోసానికి పాల్పడుతున్న రైస్ మిల్లర్..!

Author
Posted By TELANGANA KERATAM
| 24 Nov 2026, 10:24 PM | 3 | Politics, తెలంగాణ
వేయింగ్ స్కేల్ తూకంలో మోసానికి పాల్పడుతున్న రైస్ మిల్లర్..!
వేయింగ్ స్కేల్ తూకంలో మోసానికి పాల్పడుతున్న రైస్ మిల్లర్..!

ఒక్కో వాహనానికి సుమారు 05 క్వింటాళ్ల వరకు వ్యత్యాసం

బట్టబయలు చేసిన ఐలాపూర్ రైతు వెల్మ సంజీవ్ రెడ్డి

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఓ రైస్ మిల్లర్ పాల్పడుతున్న భారీ తూకం మోసాలను ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు వెల్మ సంజీవ్ రెడ్డి బట్టబయలు చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లులకు విక్రయించడానికి వెళ్లినప్పుడు, కాంటా (వేయింగ్ స్కేల్) తూకంలో భారీ వ్యత్యాసాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. సంజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామ శివారులోని ఓ రైస్ మిల్ కు ధాన్యం లోడుతో వెళ్లే ప్రతి ట్రాక్టర్ వాహనానికి సంబంధించిన కాంటా తూకంలో సుమారు 07 క్వింటాళ్ల వరకు తక్కువ వ్యత్యాసం చూపిస్తూ, రైతులను నిలువునా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఈ తూకం తేడాలను గుర్తించిన వెంటనే ఆయన ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చి, సదరు మిల్లర్ ను నిలదీయగా, ఆయా రైస్ మిల్లర్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, లేదా లెక్కలు సరిచేసే క్రమంలో దాదాపు 12 మంది రైతుల వాహనాలకు సంబంధించి, ఒక్కో వాహనానికి సుమారు 05 క్వింటాళ్ల చొప్పున (మొత్తం 60 క్వింటాళ్ల మేర) అదనంగా తూకాన్ని కలిపినట్లు సంజీవ్ రెడ్డి వెల్లడించారు. కాంటా యంత్రాల నిర్వహణలో జరుగుతున్న ఇలాంటి అక్రమాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైస్ మిల్లుల వేయింగ్ స్కేళ్లపై కఠిన తనిఖీలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: