కమ్మర్ పల్లి లో రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాల ఆవిష్కరణ
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 24:
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ రాజ్యాంగ దినోత్సవ మహాసభ కరపత్రాలనుఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ మాట్లాడుతూ.ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ మహాసభకు కమ్మర్‌పల్లి మండలంలోని అన్ని గ్రామాల అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు, బహుజనవాదులు, రాజ్యాంగ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు.అదేవిధంగా ఈ మహాసభలో హైకోర్టు న్యాయవాది, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు డా. కదిరే కృష్ణ రచించిన “అద్వితీయ నాయకుడు డా. బి.ఆర్. అంబేద్కర్” పుస్తక ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం వంటి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ మహాసభ ఎంతగానోఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం కన్వీనర్ నిమ్మరాజేంద్రప్రసాద్, కార్యవర్గ సభ్యులు లెక్చరర్ సాయన్న, ఆవుల రాజేశ్వర్, వినయ్, మహేష్, భారత్, అరవింద్, రమంజి, డా. గంగాధర్, శంకర్, బుచ్చయ్య, లింగం తదితరులు పాల్గొన్నారు.



