పాపం సంచయమే అంతులేని దుఃఖానికి కారణం
లేదా
పుణ్య కర్మలకు నిజమైన సుఖం కల్గుతుంది
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 24 :
మన జీవితాలకు మనమే కర్తలం. పాపం సంచయమే అంతులేని దుఃఖానికి కారణం. ఐతే ఓ మానవుడిగా పుణ్య కర్మలే చేయాలి. పుణ్య సంచయమే సుఖానికి నిజమైన కరణాలు. పాపాలకు విరుగుడు ప్రాయశ్చిత్త యజ్ఞాలు, ప్రార్థనలు, గంగాస్నానాలు కావు. చేసిన కుకర్మాలకు ప్రశ్యతాపం చెంది, మళ్ళీ అలాంటివి చేయొద్దని నిర్ణయం తీసుకోవాలి. పాపల నుంచి జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉండాలి. అప్పుడే కానీ మానవుడికి మనసు శాంతి కల్గుతుంది. ధైర్యంగా ఉండగల్గుతాడు. సజ్జన్నులుగా పరిశుద్ధులైన వారిగా సమాజంలో గుర్తింపు పొందుతారని భగవాన్ బుద్ధుడు జైతవనంలో బోధించారని ధమ్మ రక్ఖితవివరించారు.మంగళవారం రోజు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లోగల మోక్షానంద బుద్ధ విహార్లో మార్గశిర/ కార్తీక పౌర్ణమి వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా గుంటూరు నుంచి మహేదా వంశీ భిక్షువు హాజరైయ్యారు. మార్గదర్శకులుగా ప్రఖ్యాత బౌద్ధగురువు పండితులు భిక్ఖు ధమ్మ రక్ఖిత ప్రవచనం అందించారు. ఈ కార్యక్రమానికి చాకేటి లక్ష్మణ్ ద్వారా అన్నదానం జరగగా, క్రాంతి కిరణ్ భిక్షువులకు చివర /వస్త్ర దానం చేశారు. ఇందులో అనేక గ్రామాల నుంచి మహిళ పురుష ఉపాసకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
.



