ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి.
రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి.
నాలుగు లేబర్ కొడులను ను రద్దు చేయాలి.
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 27):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రధాన అధికారి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని రైతులు పండించిన పంటలకు చట్టబద్ధత కల్పించాలని విబి రాంజీ పథకానికి అధిక నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడు లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసులు, మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయని,. చారిత్రాత్మక రైతు ఉద్యమానికి ఆరేండ్లు పూర్తవుతున్న సందర్భంగా రైతులు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను రద్దు చేయాలనీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా సిఇసి నిర్ణయాలు చేస్తూ దేశంలో 13 కోట్ల మంది ఓటర్లను తొలగించి దాని ద్వారా అధికారంలోకి రావాలని బీహార్ పశ్చిమబెంగాల్ తెలంగాణ తదితర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం దుర్మార్గమని వారు అన్నారు. 2021 డిసెంబరులో రైతుల చారిత్రాత్మక ఉద్యమం ముగిసిన సందర్భంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అయితే ఐదేండ్లు గడుస్తున్నా ఆ హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయని .అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడులు రద్దు చేయాలని కార్మికుల కనీస వేతనం 42,000 పెంచాలని స్కీం వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగాలుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా సమగ్ర సాగు వ్యయం (సి2)పై 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయని . భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలగాలనీ, అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. సమగ్ర రుణమాఫీ అమలు చేయాలనీ, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాయని . విద్యుత్, విత్తన బిల్లులను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వర్ధన్ పర్వతాలు, కో-శాధికారి పొదిల రామయ్య, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుభాష్, కెవిపిఎస్ ఉపాధ్యక్షులు కొంపల్లి అశోక్, సత్యనారాయణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మధు, రాముడు, శ్యామ్, నరసింహ, సుధాకర్,పాషా, తదితరులు పాల్గొన్నారు.



